రేపటి నుంచి అయిదు రోజులపాటు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు

328

Image result for civil services mains 2019

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు శుక్రవారం (సెప్టెంబరు 20) నుంచి అయిదు రోజులపాటు  పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 20, 21, 22, 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహించనున్నారు
ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ సంవత్సరం జూన్ 2న దేశవ్యాప్తంగా మొత్తం 72 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

మెయిన్ పరీక్షలు ఇలా..
✦ సివిల్స్ మెయిన్స్‌లో మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి. అయితే వీటిలో రెండు లాంగ్వేజ్ (ఇంగ్లిష్, స్థానిక భాష) పేపర్లు కేవలం అర్హత పేపర్లు మాత్రమే.
✦ మిగిలిన 7 పేపర్లలో పేపర్-1: జనరల్ ఎస్సేతోపాటు నాలుగు జనరల్‌స్టడీస్ పేపర్లు, ఒక ఆప్షనల్‌కు సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి.
✦ ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం ఏడు పేపపర్లకు 1750 మార్కులు ఉంటాయి.
✦ ఈ పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఇంటర్వ్యూ జాబితాను రూపొందిస్తారు.
✦ ఇంటర్వ్యూకు 275 మార్కులతో కలిపి మొత్తం 2025 మార్కులకు అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.

Download E-Admit card : https://upsconline.nic.in/eadmitcard/index.php

Time Table 

Image result for civil services mains 2019 time table

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here