టీఎస్ ఎస్పీడీసీఎల్ లో  జేపీవో, జూనియర్ లైన్ మెన్ పోస్టులకు నోటిఫికేషన్ 

2257

టీఎస్ ఎస్పీడీసీఎల్  జేపీవో, జూనియర్ లైన్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ 

తెలంగాణ రాష్ట్రం యొక్క సథరన్  పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లో  జూనియర్  లైన్ మెన్ , జేపీవో మరియు  జూనియర్  అసిస్టెంట్  కమ్ కంప్యూటర్  ఆపరేటర్  పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్  జారీ చేసింది. మొత్తం  మూడు  కేటగిరీ లలో 2,939 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. దీని యొక్క అఫిషియల్ నోటిఫికేషన్ ను అక్టోబర్ 10 వ తేదీన దక్షిణ తెలంగాణ విద్యుత్ కంపెనీ అయిన అధికారిక వెబ్సైటు లో  ఉంచుతామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంకా జిల్లాల వారీగా మరియు రిజర్వేషన్ వారీగా ఎన్ని ఖాళీలు , అర్హతల గురించి నోటిఫికేషన్ లో తెలుపుతామని వెల్లడించింది. అభ్యర్థులు వచ్చే నెల 10 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వారీగా ఖాళీలు మరియు అధికారిక వెబ్సైటు అడ్రస్ క్రింద ఇవ్వడం జరిగింది.  

 

పోస్టు  వారీగా ఖాళీలు 

  • జూనియర్  లైన్ మెన్   2438
  • జూనియర్ పర్సనల్ అధికారి (జేపీవో ) 24
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – 477

టీఎస్ ఎస్పీడీసీఎల్  అధికారిక  వెబ్సైట్: tssouthernpower.com 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here