తెలంగాణాలోని గురుకులాల్లో 3 వేల ఖాళీలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల

961

Notification for TS Gurukula Teaching& Non-Teaching Posts 2019

తెలంగాణాలోని గురుకులాల్లో 3 వేల ఖాళీలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల

Notification for TS Gurukula Teaching& Non-Teaching Posts

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3 వేల ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వెల్లడించేందుకు అవకాశం ఉంది. వీటి ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లోని పోస్టులతో పాటు.. గతంలో ప్రభుత్వం అనుమతించినా.. వెలువడని పోస్టులతో కలిపి  జారీకానున్నాయి. వీటిలో బీసీ సొసైటీ నుంచి 2000 కు పైగా ఖాళీలున్నాయి.

ఇప్పటికే సొసైటీల నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్‌ విధానం ప్రకారం 2200 పోస్టుల ఖాళీల భర్తీకి పంపిన ప్రతిపాదనలకు గురుకుల నియామక బోర్డు ఆమోదం తెలిపింది, అయితే వీటితో పాటు మరో 600 పైగా పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here