Telugu language book exhibition at Grays Library

359

Telugu language book exhibition at Grays Library

బ్రిటన్‌లో తొలిసారిగా తెలుగు పుస్తకాల ప్రదర్శన

IMG_7229

బ్రిటన్‌లోని ప్రసిద్ధిచెందిన థుర్రోక్ డివిజన్ గ్రేస్ లైబ్రరీలో తొలిసారిగా తెలుగు భాషకు చెందిన పుస్తకాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు పాఠకులనుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆగస్టు 24న బ్రిటన్‌కు చెందిన నవసమాజ్ దర్పణ్ అనే స్వచ్ఛంద సంస్థ తెలుగు పుస్తక ప్రదర్శన నిర్వహించింది. బ్రిటన్‌లో తెలుగు భాషకు చెందిన పుస్తకాల ప్రదర్శన నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రదర్శనను థుర్రోక్ డివిజన్ గ్రేస్ లైబ్రరీలో నిర్వహించారు. అన్నిరకాల పుస్తకాలను పాఠకులకు సాధారణ, ఆధ్యాత్మిక, బాలలు సహా సహ వివిధ రకాల పుస్తకాలను ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంచారు.పురాతన భారతీయ భాషలలో ఒకటైన తెలుగు గొప్పదనాన్ని వారికి నిర్వహకులు తెలియజేశారు. బ్రిటన్‌లో ఉండే తెలుగువారే కాకుండా తమిళులు, బెంగాలీలు, శ్రీలంక , ఐర్లాండ్, బ్రిటన్ పౌరుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. తెలుగేతర పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా నవసమాజ్ దర్పణ్ సభ్యులు పుస్తకాలను ఇంగ్లిష్‌లో అందుబాటులోకి ఉంచారు.

అలాగే, బ్రిటన్‌లో ఉన్న తెలుగువారి పిల్లలకు వారాంతాల్లో తెలుగు భాషకు సంబంధించి పాఠాలను నేర్పించాలని నిర్ణయించారు. అంతేకాదు, ఆగస్టు 31న ఎన్ఎస్డీ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నామని, అదే రోజు రెండో పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. పుస్తకాల ద్వారా స్వచ్ఛందంగా బ్రిటన్‌లో తెలుగు భాషకు విశేష ప్రచారం కల్పించనున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌లోని తెలుగు సంతతికి చెందిన ప్రస్తుత తరానికి మాతృభాషలో చదవడం, రాయడం వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని, ఇది తమకు పెద్ద సవాల్‌గా మారిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుంచి అనేక పుస్తకాలను ఆయన తమకు అందజేసినట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here