తెలంగాణ ఎస్జీటీ పోస్టుల కేటాయింపు షెడ్యూల్ విడుదల  

752

తెలంగాణ ఎస్జీటీ పోస్టుల కేటాయింపు షెడ్యూల్ విడుదల  

Telangana TRT SGT Posting Schedule Released 2019తెలంగాణ రాష్ట్రం లోని  టీఆర్‌టీ ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం పోస్టులకు సంబంధించిన నియామక షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. వీటిలో మొత్తం 909 పోస్టులను ప్రభుత్వం విడుదల చేయగా.. వీటిలో 842 మంది పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ప్రక్రియ అంతా షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ నెల , న‌వంబ‌రు 13న ఎంపికైన అభ్యర్థులకు  ధ్రువ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం నవంబరు 14న వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి.. నియామక పత్రాలు అందజేయనున్నారు.

అభ్యర్థులు ఎవరైతే  కౌన్సెలింగ్‌కు హాజరు అవ్వలేకపోయారో వారికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న‌వంబ‌రు 18న పోస్టు ద్వారా నియామక పత్రాలు పంపనున్నారు. నియామక పత్రాలు అందుకొని పోస్టింగులు పొందినవారు నిర్ణీత తేదీలోగా సంబంధిత పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గడువులోగా రిపోర్టు చేసినప్పటికీ.. ఉద్యోగాల్లో చేరని అభ్యర్థుల వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న‌వంబ‌రు 20లోగా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here