Telangana New Cabinet Ministers 2019

429

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

Image result for KCR Inducts 6 Ministers in Telangana Cabinet

మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే శాఖలను కేటాయించారు.గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌రావుకు ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు.అలాగే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్‌ శాఖలను కేటాయించారు.కీలకమైన విద్యాశాఖను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దక్కించుకున్నారు

సత్యవతి రాఠోడ్‌కు గిరిజన, మహిళా, శిశు సంక్షేమం, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖను ,గంగుల కమలాకర్ – బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ సీఎం కేటాయించారు.తాజాగా జరిగిన కేబినెట్‌ విస్తరణతో మంత్రుల సంఖ్య 18కి చేరింది. విస్తరణ తర్వాత మంత్రివర్గ స్వరూపమిదీ,

 నూతన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ వీరితో​ పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన.. కొద్ది సమయంలోనే వారందరికీ శాఖలను కేటాయించారు. అయితే ఇవాళ రాత్రి 7 గంటలకు మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం. బడ్జెట్‌పై చర్చించిన అనంతరం కేబినెట్‌ దానిని ఆమోదించనుంది

1 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాంతి భద్రతలు రెవెన్యూ, నీటి పారుదల
2 మహమూద్ అలీ హోం
3 ఈటల రాజేందర్  వైద్య-ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
4 టి.హరీశ్‌ రావు ఆర్థిక శాఖ
5 కె.తారక రామారావు  ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి
6 పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి  విద్యాశాఖ
7 ఇంద్రకరణ్ రెడ్డి అటవీ, పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక,దేవాదాయ, న్యాయ
8 గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విద్యుత్
9 తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పశు సంవర్థకం, మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ
10 సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్
11 ఎర్రబెల్లి దయాకరరావు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా
12 కొప్పుల ఈశ్వర్ షెడ్యూల్డు కులాల అభివృద్ధి, మైనారిటీ,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం
13 వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాలు,గృహ నిర్మాణం
14 వి.శ్రీనివాస్ గౌడ్ ప్రొహిబిషన్ – ఎక్స్సైజ్, క్రీడలు – యువజన సేవలు,పర్యాటక సాంస్కృతిక, పురావస్తు శాఖలు
15 సత్యవతి రాఠోడ్ స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
16 పువ్వాడ అజయ్ కుమార్ రవాణాశాఖ
17 చామకూర మల్లారెడ్డి కార్మిక, ఉపాధి కల్పన
18 గంగుల కమలాకర్ బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here