తెలంగాణ స్టేట్ గ్రూప్ 2 ఫలితాలు మరియు పోస్టుల వారీగా ఎంపికైన జాబితా

809

తెలంగాణ స్టేట్ గ్రూప్ 2 ఫలితాలు మరియు పోస్టుల వారీగా ఎంపికైన జాబితా  

 

Telangana Group 2 Selected List 2019

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 24న గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణలో సుదీర్ఘంగా కొనసాగిన ‘గ్రూప్-2’ వివాదం సమసిపోవడంతో.. ఎట్టకేలకు ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను తెలంగాణ స్టేట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 1032 గ్రూప్-2 ఉద్యోగాలకు గానూ.. 1027 మంది అభ్యర్థులను తుది జాబితాకు టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. ఉద్యొోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను హాల్‌టికెట్ నెంబర్లతో సహా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మిగిలిన 5 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు.

గ్రూప్ 2 ఫలితాలు కొరకు: Click Here 

మొత్తం 1032 పోస్టులకుగాను 1 : 2 నిష్పత్తిలో 3,147మంది అభ్యర్థులను జులై 1 నుంచి ఆగష్టు 28 వరకు టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. తరువాత కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వివిధ శాఖల్లో  గ్రూప్-2 పోస్టులు: 

పోస్టు పోస్టు సంఖ్య
ఏసీటీవో 156
ఎక్సైజ్‌ ఎస్సై 284
డిప్యూటీ తహశీల్దారు 259
సాధారణ పరిపాలన ఏఎస్‌వో 90
పంచాయతీరాజ్‌ ఈవో 67
సహకార సహాయ రిజిస్ట్రార్లు 62
ఆర్థికశాఖ ఏఎస్‌వో 28
సబ్‌రిజిస్ట్రార్‌ (గ్రేడ్‌-2) 23
చేనేత, జౌళి సహాయ అభివృద్ధి అధికారులు 20
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3 ) 19
దేవాదాయశాఖ పరిపాలన అధికారులు 11
న్యాయశాఖ ఏఎస్‌వో 10
సహాయ కార్మికశాఖ అధికారులు 03
మొత్తం పోస్టులు 1032
భర్తీ చేసిన పోస్టులు 1027
మిగిలిన పోస్టులు 05

 

గ్రూప్ 2 టాపర్లు: 

 1. ఉదరస నరేష్ – ఖమ్మం 
 2. ఒగ్గు రఘునందన్ రెడ్డి – ఖమ్మం 
 3. బి.మనోహర్ రావ్ – మెదక్ 
 4. ఎం.చంద్రశేఖరరెడ్డి – మహబూబ్ నగర్ 
 5. లక్కిరెడ్డి శివతేజ –  వరంగల్
 6. మధు బి – వరంగల్
 7. ఆకుల వెంకటేష్ – ఆదిలాబాద్
 8. వంతంగి భాస్కర్ – వరంగల్
 9. చెన్నా నాగేశ్వరరావు – ఖమ్మం
 10. మర్రి పెల్లి అనిల్ కుమార్ – నల్గొండ 

టాప్ 5 మహిళలు:

 1. దేవగిరి నిర్మల – ఖమ్మం 
 2.  సుజాత రాణి బలుసు – ఖమ్మం 
 3. ఓలాద్రి నవత – వరంగల్ 
 4. ఆకారపు ప్రశాంతి – నల్గొండ 
 5. సుజాత.ఎ – నల్గొండ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here