తెలంగాణ ‘దోస్త్‌’ నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశ షెడ్యూలు వివరాలు

512తెలంగాణ ‘దోస్త్‌’ నోటిఫికేషన్ విడుదల.. 

ప్రవేశ షెడ్యూలు

తెలంగాణలో వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ)’ నోటిఫికేషన్  విడుదలైంది.  బుధవారం (మే 23) ‘దోస్త్’ ప్రవేశ ప్రకటనను దోస్త్ కమిటీ  విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది.

షెడ్యూలు ప్రకారం మే 23తో ప్రారంభం కానున్న ఈ  ప్రవేశ ప్రక్రియ జూన్ 29తో ముగుస్తుంది . అలాగే జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 . (Rs.400 ఆలస్య రుసుముతో జూన్ 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.)

రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..

నోటిఫికేషన్ తేదీ: మే 22

దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ: మే 23 నుంచి జూన్ 8 వరకు

వెబ్ ఆప్షన్ల నమోదు: మే 25 నుంచి జూన్ 3 వరకు

రూ.400 ఆలస్య రుసుంతో గడువు: జూన్ 4 వరకు

ప్రత్యేక క్యాటగిరీ విద్యార్థులకు వెరిఫికేషన్: జూన్ 1, 3, 4 తేదీల్లో

తొలివిడుత సీట్ల కేటాయింపు: జూన్ 10,

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్జూన్ 10 నుంచి 15 వరకు

రెండోవిడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ: జూన్ 10 నుంచి 15 వరకు

రెండోవిడత వెబ్ ఆప్షన్లు నమోదు: జూన్ 10 నుంచి 15 వరకు

రెండోవిడత స్పెషల్ క్యాటగిరీ వెరిఫికేషన్: జూన్ 15

సీట్ల కేటాయింపు తేదీ: జూన్ 20

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 20 నుంచి 25 వరకు

మూడోవిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ: జూన్ 20 నుంచి 25 వరకు

ప్రత్యేక క్యాటగిరీవారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 25

మూడోవిడత సీట్ల కేటాయింపు: జూన్ 29

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 1 నుంచి 4 వరకు

సీట్లు పొందినవారు కాలేజీల్లో రిపోర్టింగ్: జూలై 1 నుంచి 4 వరకు

డిగ్రీ తరగతులు ప్రారంభం (సెమిస్టర్): జూలై 1 నుంచి ప్రారంభం

ఇంట్రా-కాలేజీ ఫేజ్: జూలై 5 నుంచి 7 వరకు

సీట్ల కేటాయింపు: జూలై 10

ప్రత్యేక సహాయక కేంద్రాలు..
‘దోస్త్’ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ప్రవేశాల్లో.. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి సీటు ఖరారు చేసుకునే వెసులుబాటును కల్పించారు. కులం, ఆదాయ ధృవపత్రాలు జతపరిచే విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాష్ట్రంలోని 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్రంలోని పలు కళాశాలలు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా కాకుండా నేరుగా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఆయా కళాశాలలు ‘దోస్త్‌’ పరిధిలో ఉండవు. 

NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here