RRB NTPC Preparation Strategy, Important Dates, Qualification in Telugu

1317

RRB NTPC Preparation Strategy, Important Dates, Qualification in Telugu

RRB NTPC Preparation Strategy, Important Dates, Qualification in Telugu

RRB NTPC Preparation Strategy, Important Dates, Qualification in Telugu

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

 

రైల్వే జాబ్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

భారతీయ రైల్వేలో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 35,277 నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (ఎన్‌టిపిసి) పోస్టులను రైల్వే బోర్డు భర్తీ చేయనుంది. ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్షను రెండు దశల్లో నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31.



ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం: మార్చి 1 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
కంప్యూటర్‌ ఆధారిత మొదటి దశ పరీక్ష: జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు
వెబ్‌సైట్‌: http://www.rrbsecunderabad.nic.in/

గ్రాడ్యుయేట్‌ పోస్టుల సంఖ్య : 24,649

జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌:
4319
అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌
760
జూనియర టైం కీపర్‌
17
ట్రైన్స్‌ క్లర్క్‌
592
కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌
4940

 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల సంఖ్య: 10,628

ట్రాఫిక్‌ అసిస్టెంట్‌
88
గూడ్స్‌ గార్డ్‌
5748
సీనియర్‌ కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌
5638
సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌
2873
జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌
3164
సీనియర్‌ టైమ్‌ కీపర్‌
14
కమర్షియల్‌ అప్రెంటిస్‌
259
స్టేషన్‌ మాస్టర్‌
6865

 

ఆర్‌ఆర్‌బి సికింద్రాబాద్‌ పరిధిలోని ఖాళీల వివరాలు : 3234

జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌:
119
అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌
66
జూనియర టైం కీపర్‌
17
ట్రైన్స్‌ క్లర్క్‌
20
కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌
591
ట్రాఫిక్‌ అసిస్టెంట్‌
88
గూడ్స్‌ గార్డ్‌
722
సీనియర్‌ కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌
435
సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌
113
జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌
89
సీనియర్‌ టైమ్‌ కీపర్‌
14
కమర్షియల్‌ అప్రెంటిస్‌
14
స్టేషన్‌ మాస్టర్‌
810

     

అర్హత:
అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 2019 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఏదేని బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 2019 జూలై 1 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:
సంబంధిత రైల్వే బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.500. రాయితీ లభించే వర్గాలకు రూ.250.

రిజర్వేషన్లు
ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ-నాన్‌ క్రిమిలేర్‌, ఈడబ్ల్యూ ఎస్‌ వర్గాలకు రిజర్వేన్లు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:
మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. మొదటి దశ ఆన్‌లైన్‌ పరీక్ష. రెండో దశను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. మూడో దశలో భాగంగా పోస్టులను బట్టి టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇక నాలుగో దశలో డాక్యుమెంటేషన్‌ వెరిఫికేషన్‌/వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్ష స్వరూపం
మొదటి దశ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. జనవరల్‌ అవేర్‌ నుంచి 40 ప్రశ్నలు, మేథ్స్‌ నుంచి 30 ప్రశ్నలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 100. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. ప్రతి సరికాని సమాధానానికి 1/3వ మార్కు కట్‌ చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశ పరీక్షకు అనుమతిస్తారు. రెండో దశ పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు, మేథ్స్‌ నుంచి 35, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష కూడా మొదటి దశ పరీక్ష లాగే ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. దీనిలో సాధించిన మెరిట్‌ ప్రకారం, పోస్టులను బట్టి టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

ప్రిపరేషన్‌ విధానం
జనరల్‌ అవేర్‌నెస్‌
జనరల్‌ అవేర్‌నెస్‌ చాలా విస్తృతమైన అంశం. ఒక్క రోజులో దీనిపై పట్టు సాధించడం సులువేమీ కాదు. దీని అధ్యయనానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. అప్పుడే దీనిపై కొంత అవగాహన ఏర్పడుతుంది. రెండు ప్రశ్న పత్రాల సిలబ్‌సను గనుక విశ్లేషించిన్లయితే మొత్తం మొత్తం 220 మార్కులకు గాను 90 మార్కులు జనరల్‌ అవేర్‌నెస్‌కే కేటాయించారు. అయితే దేనికదే పేపర్లు విడివిడిగా ఉంటాయి. మిగతా విభాగాలైన మేథ్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌తో పోల్చితే ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలను గుర్తించవచ్చు. ఈ విభాగంలోని ఇతర సబ్జెక్టులను పరిశీలిస్తే… కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవాలంటే రోజూ తప్పని సరిగా జాతీయ దినపత్రికలు చదవాలి. ప్రభుత్వాల తాజా విధానపర నిర్ణయాలు, పుస్తకాలు-రచయితలు, వార్తల్లోని ప్రదేశాలు-వ్యక్తులు, సమకాలీన ముఖ్య సంఘటనలు వంటిని అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థి పరీక్ష సమయానికి ఆరు నెలల ముందటి కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధిస్తే సరిపోతుంది. అదేవిధంగా జనరల్‌ సైన్స్‌ అంశాలపై అభ్యర్థులకు ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఈ అధ్యయనానికి బాగా ఉపయోగపడతాయి. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ… ఈ మూడింటిని కలిపి జనరల్‌ సైన్స్‌గా పరిగణిస్తారు. చరిత్రకు సంబంధించినంత వరకు భారతదేశ చరిత్ర స్వాతంత్య్ర ఉద్యమం గురించి చదువుకుంటే చాలు. పాలిటీ అంశాలకొస్తే భారత రాజ్యాంగ చరిత్ర, ప్రవేశిక, రాజ్యాంగ నిర్మాణంలో ఇతర దేశ రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వీటితో పాటు వివిధ ఆర్టికల్స్‌, ప్రాథమిక హక్కులపై పట్టు సాధించాలి. ముఖ్యంగా విభాగంలోని అంశాలను ఇతర అంశాలతో పోల్చుకుంటూ చదువుకోవాలి. ఉదాహరణకు పాలిటీ మూసధోరణితో కాకుండా మొదటి ప్రధాన మంత్రి, తరవాత ముఖ్యమంత్రి, ఆ తరవాత పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు ….ఇలా ఒక పద్ధతి ప్రకారం చదవాలి. జాగ్రఫీలో ఏ పోటీ పరీక్షలోనైనా ఎక్కువగా ఇండియన్‌ జాగ్రఫి నుంచే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇండియన్‌ జాగ్రఫికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించి పెట్టుకోవడం మంచిది. నేలలు-రకాలు, భారతదేశ నదీ వ్యవస్థ, 2011 జనాభా గణన, వాతావరణ పొరలు, వాణిజ్యం-రవాణా, విశ్వం తదితర వాటిని ఒక సారి మననం చేసుకొంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ అంశాలన్నీ మీరు 6 నుంచి 12వ తరగతి వరకు చదువుకొన్నవే. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో ఎకానమీ మరో ముఖ్యమైన సబ్జెక్టు. ఈ సబ్జెక్టును ప్రభుత్వ పథకాలతో లింకప్‌ చేసుకుంటూ చదవడం మంచిది. జిడిపి, జిఎన్‌పి, ఎన్‌ఎన్‌పి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌ ప్రక్రియ, ఆర్‌బిఐ విధానాలు, వ్యవసాయ సబ్సిడీలు, పౌరసరఫరాలు, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. బడ్జెట్‌ ప్రాధాన్యం, సెబీ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఉపాధి కల్పన, బ్యాంకింగ్‌ రంగం, సెన్సెక్స్‌, కేంద్ర ప్రణాళికలు ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళిక, ప్రణాళికల స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్‌ వ్యవస్థపై అవగాహనను పెంచుకోవాలి.

మేథ్స్‌:
అభ్యర్థులకు బేసిక్‌ మేథ్స్‌పై కనీస అవగాహనను పెంచుకోవాలి. కూడికలు, తీసివేతలు, గుణాంకాలు, భాగహారంపై పట్టుసాధిస్తే ఈ విభాగంలో సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చు. సంఖ్యామానం, సరాసరి, భాగస్వామ్యం, శాతాలు, లాభ నష్టాలు, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, కాలం-పని, క్లాక్స్‌ అండ్‌ క్యాలెండర్స్‌, మెన్సురేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంట్రప్రిటేషన్‌, పజిల్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌,g డైరెక్షన్స్‌ వంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. అప్పుడే క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌, అనలిటికల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు సులువుగా చేయగలరు.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌:
ఈ విభాగంలో వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ రెంటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అనలాగ్స్‌, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్‌, స్పేస్‌ విజువలైజేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, అనాలిసిస్‌, జడ్జ్‌మెంట్‌, డెసిషనల్‌ మేకింగ్‌, విజువల్‌ మెమొరీ, డిస్ర్కిమినేటింగ్‌ అబ్జర్వేషన్‌, రిలేషన్‌షి్‌ప కాన్సెఫ్ట్స్‌, అర్థమెటికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ అండ్‌ ఫిగర్‌ క్లాసిఫికేషన్‌, అర్థమెటికల్‌ నెంబర్‌ సిరీస్‌, నాన్‌ వెర్బల్‌ సిరీస్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆయా అంశాల్లో అభ్యర్థులకున్న సామర్థ్యాలను పరీక్షించేవిగా ప్రశ్నలు ఉంటాయి. నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌. ఈ రెంటిలో వెర్బల్‌ రీజనింగ్‌ ప్రాధాన్యం కలది. దాదాపు ఎక్కువ శాతం ప్రశ్నలు వెర్బల్‌ రీజనింగ్‌ నుంచే వస్తాయి. ఈ వెర్బల్‌ రీజనింగ్‌లో 20 టాపిక్స్‌ ఉంటాయి. కోడింగ్‌-డీకోడింగ్‌, ఆల్ఫాబెటికల్‌ సిరీస్‌, ఆల్ఫాబెట్‌ టెస్ట్‌, భిన్న పరీక్ష, పోలిక పరీక్ష ముఖ్యమైన అంశాలు. వీటిపై పట్టు సాధించాలంటే వీలైనన్నీ ఎక్కువ సార్లు ప్రొబ్లెమ్స్‌ సాల్వ్‌ చేయాలి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే షార్ట్‌కట్‌ మెథడ్స్‌ తెలిసి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం: మార్చి 1 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
కంప్యూటర్‌ ఆధారిత మొదటి దశ పరీక్ష: జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు
వెబ్‌సైట్‌: http://www.rrbsecunderabad.nic.in/

RRB NTPC Notification in English

నోటిఫికేషన్

ఆన్‌లైన్ అప్లికేషన్

వెబ్‌సైట్

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here