బీసీ, ఓసీ అభ్యర్థులకు సచివాలయ అర్హత మార్కులు తగ్గింపు

3202

బీసీ, ఓసీ అభ్యర్థులకు సచివాలయ అర్హత మార్కులు తగ్గింపు

 

Reduction of qualify marks for BC and OC candidates

త్వరలోనే  ఏపీలో ఓసీ, బీసీ అభ్యర్థులకు గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఉద్యోగ నియామకాల్లో భాగంగా బీసీ, ఓసీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను తగ్గించనున్నారు. దీనికి సంబంధించి రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

అక్టోబరు 28న ఈ  ప్రతిపాదనలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ  ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపనుంది. దీనిపై ప్రభుత్వ ఆమోదముద్ర ఇవ్వగానే  అర్హత మార్కులను తగ్గించి.. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను సచివాలయ ఉద్యోగాల్లో నియమించనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 1,26,728 సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించడం జరిగింది. అదే విధంగా బీసీ, ఓసీ అభ్యర్థులకు కూడా కటాఫ్‌ మార్కులను 5 నుంచి 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. దీంతో అదనంగా మరో 25 వేల ఖాళీలు భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here