అక్టోబ‌రు 30వ తేదీకి వాయిదా పడిన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

270

తిరుమలగిరి ‘ది గార్డ్స్‌, 125 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌’ ఆధ్వర్యంలో అక్టోబ‌రు 15 నుంచి 25 తేదీ వరకు జరగాల్సిన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని వాయిదా పడ్డట్లు రక్షణ శాఖ పీఆర్వోలు ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని అక్టోబ‌రు 30 నుంచి నవంబరు 6 వరకు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, గోవా, దాద్రా-నగర్‌ హవేలీ, దమణ్‌, లక్ష్వదీప్‌, పాండిచ్చేరి ప్రాంతాల అభ్యర్థుల కోసం ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొనదలచిన అభ్యర్థులు అక్టోబ‌రు 20లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here