పారామెడికల్ కోర్సుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

615

నేటి నుంచి పారామెడికల్ కోర్సుల దరఖాస్తు ప్రక్రియ

NTR Health University has Released Notification for Admissions in to Various Paramedical Courses for the Academic Year 2019-20

ఏదైనా చిన్న లేదా పెద్ద ఆరోగ్య సమస్యతో డాక్టర్‌ దగ్గరకు వెళితే వ్యాధిని నిర్దారిచేందుకు రోగ నిర్ధారణకు టెస్ట్‌లు చేయిస్తారు. టెస్టులు చూసి మెడిసిన్‌ అంతే మోతాదులో ఇస్తారు. పూర్తి చికిత్స కోసం ఏం చేయాలో చెబుతారు. నయం చేయడంలో ప్రత్యక్షంగా మనకు డాక్టర్‌ మాత్రమే కనిపించినప్పటికీ రకరకాల పరీక్షలు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు తదితరాల కోసం ఎందరో సాయం చేస్తారు వీరందరినీ పారామెడికల్‌ సిబ్బంది అంటారు. కొన్ని ప్రత్యేకమైన కోర్సులు చేయడం ద్వారా వాళ్లు ఆ నైపుణ్యాలను పొందుతారు. ఇంటర్మీడియట్‌ తర్వాత వైద్యసంబంధ సేవల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇవి మంచి మార్గాలు.

ఇంటర్ (బైపీసీ) విద్యార్హత ఉన్నవారు పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ), బీఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో 2019-20 విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి బుధవారం (సెప్టెంబరు 18) నోటిఫికేషన్ వెలువడింది. గురువారం (సెప్టెంబరు 19) మధ్యాహ్నం 1 గంట నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై అక్టోబరు 3న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారామెడికల్ కాలేజీల్లో బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ), బీఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు కోరేవారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 89787 90501 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

వెబ్‌సైట్ :  http://ntruhs.ap.nic.in/index.html

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here