భారత నౌకాదళ దినోత్సవం (నేవీ డే)

469

భారతదేశానికి నౌకాదళం చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. భారత్, పాక్ యుద్ధం సందర్భంగా మన నౌకాదళం మెరుపు దాడితో పాకిస్థాన్‌ను గడగడలాడించింది. భారత యుద్ధ నౌకలు 1971 డిసెంబర్ 4న కరాచీ హార్బర్‌పై దాడి చేశాయి పాక్‌ను దెబ్బతీశాయి. నాటి నుంచి డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుపుకొంటున్నారు. భారత నౌకాదళ దినోత్సవం దాడిలో పాకిస్థాన్‌కు చెందిన నాలుగు నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఇంధన నిల్వ క్షేత్రాలు ధ్వంసం కావడంతోపాటు, 500 మందికిపైగా పాక్ నేవీ సిబ్బంది చనిపోయారు.
ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు,
1971 డిసెంబర్ 4న గుజరాత్‌లోని ఒఖా పోర్టు నుంచి పాక్ సాగర జలాల దిశగా బయల్దేరిన ఈ నౌకలు కరాచీ పోర్ట్‌పై దాడికి దిగాయి.
అదే క్రమంలో భారత్‌ వైపున ప్రాణనష్టం జరిగింది. అరేబియా మహా సముద్రంలో భారత్‌ ఫ్రిగేడ్‌ ఐఎన్‌ఎస్‌ ఖుక్రీను ముంచివేసినప్పుడు 18 మంది అధికారులు, 176 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో భారత నౌకాదళానికి జరిగిన అతిపెద్ద నష్టం ఇదే పాకిస్తాన్‌ మాత్రం తన మూడో వంతు నావికాదళ సైన్యాన్ని కోల్పోయింది. పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ ఖైదీలు సుమారు 90 వేల మంది పట్టుబడగా, ఇండియన్‌ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ నిర్ఘాట్‌, ఐఎన్‌ఎస్‌ వీర్‌, ఐఎన్‌ఎస్‌ నిపాట్‌ ఈ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర పోషించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here