మాలే లో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

330

మాలే లో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ
మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌, మోదీ సంయుక్తంగా నాలుగు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.వీటిలో మాలేలో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్టు, మాల్దీవులలో రూపే కార్డు ప్రాజెక్టు, మూడు చేపల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌ను మాల్దీవులకు మన దేశం బహుమతిగా ఇచ్చింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ –భారత దేశం, మాల్దీవుల మధ్య స్నేహ బంధం వర్థిల్లడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇరు దేశాల ప్రజల సాన్నిహిత్యం. భారత దేశం-మాల్దీవుల సంబంధాల్లో ఈ ఏడాదికి చాలా ప్రాధాన్యం ఉంది.
ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొరుగు దేశాలకు పెద్ద పీట’ విధానం, మాల్దీవులు అనుసరిస్తున్న ‘భారత దేశానికి పెద్ద పీట’ విధానం వల్ల అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతుంది అని పేర్కొన్నారు. మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌ను గుజరాత్ లో తయారు చేశారు.
ఈ ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌ మాల్దీవుల సముద్ర భద్రత కట్టుదిట్టం కావడానికి దోహదపడుతుంది.
మాల్దీవుల్లో పర్యటించే భారతీయుల సంఖ్య రెట్టింపు అయింది.
రూపే చెల్లింపు యంత్రాంగం వల్ల భారతీయ పర్యాటకులు మాల్దీవులకు ప్రయాణించడం మరింత సులభంగా మారింది.
హుల్‌హుల్‌మలేలో కేన్సర్ ఆసుపత్రి, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి.
మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1,196 పగడపు దీవులు ఉన్నాయి.
మౌమూన్ అబ్దుల్ గయూమ్, 1978లో మొదటి ఎన్నుకోబడిన అధ్యక్షుడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్రనుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి.
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబర్ 17న ప్రమాణస్వీకారం చేశారు.
మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. దేశములోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here