1251 ఏడిఓ పోస్తులకు ప్రకటన విడుదల – LIC ADO ఎంపిక విధానం – సిలబస్ 

642

అభివృద్ధి అధికారులకు ? ఆహ్వానం

LIC ADO ఎంపిక విధానం – సిలబస్

1251 ఏడిఓ పోస్తులకు ప్రకటన విడుదల 

మార్కెటింగ్ పట్ల అభిరుచి, ఆసక్తి ఉన్న సాధారణ డిగ్రీ అభ్యర్థులను భారత జీవిత బీమా సంస్థ ఆహ్వానిస్తోంది. వీరు అభివృద్ధి అధికారులుగా  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

భారత ప్రభుత్వ రంగానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) దేశంలోనే అతి పెద్ద జీవిత బీమా, పెట్టుబడి సంస్థ. దేశవ్యాప్తంగా వేలాది శాఖలను, ఏజెంట్లను కలిగి ఉంది. జీవిత బీమా వ్యాపారంలో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఈ అత్యున్నత సంస్థ వ్యాపార విస్తరణలో అత్యంత కీలకమైన అప్రెంటిస్ డెవలపమెంట్ ఆఫీసర్ల భర్తీకి హైదరాబాద్ లోని సౌత్ సెంట్రల్ కార్యాలయం నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

 మొత్తం పోస్టులు 1251 సాధారణ డిగ్రీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

మంచి జీతంతోపాటు ఇతర ఎన్నో రకాల ప్రయోజనాలను అందించే ఈ  ఉద్యోగానికి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. పరీక్షకు తక్కువ సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రిపరేషన్ వేగంగా కొనసాగించాలి. సాధారణ డిగ్రీ చాలు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ లో  పీజీ డిగ్రీ లేదా మార్కెటింగ్ లో పీజీ డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

మే1, 2019 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి,

ఎల్ ఐ సీ లో కనీసం రెండేళ్లు పనిచేసిన మూడు దశల్లో ఎంపిక అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

ప్రిలిమ్స్  ఇది ఆన్ లైన్ జరుగుతుంది. రెండోది మెయిన్ పరీక్ష దీన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తారు మైన్స్ పరీక్షా లో సాధించిన మార్కుల ఆధారంగా మౌళిక పరీక్షకు పిలుస్తారు. అందులో అర్హత సాదించినవారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి, జాబ్ లో కి తీసుకుంటారు 

ప్రతి సెక్షన్ కి కనీస మార్కులు :

ప్రిలిమ్స్ లో మూడు సెక్షన్లు వంద మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి . అందులో రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీకి 35 మార్కులు, ఇంగ్లీష్ కి 30 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లీష్ కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే మిగితా 70 మార్కులు సాధిచిన మెరిట్ ఆధారంగా మెయిన్ పరీక్షలు ఎంపిక చేస్తారు

మెయిన్స్ పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. ఇందులో 1) రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ; 2) జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, 3) ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్, మార్కెటింగ్ ఎబిలిటీల నుంచి ప్రతి విభాగానికి ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సెక్షన్ లోనూ ఎల్ఐసీ నిర్ణయించే కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి గరిష్ఠ మార్కులు 37,

ఉద్యోగంలో చేరినవారు తప్పని సరిగా నాలుగు సంవత్సరాలు ఎల్ఐసీలో పనిచేసే విధంగా బౌండ్ సమర్పించాల్సి ఉంటుంది. మొదట ప్రొబేషనరీ డెవలపమెంట్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ప్రారంభంలో నెలకు రూ. 34503 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు. అప్రెంటిస్ డెవలపమెంట్ ఆఫీసర్లుగా ఎంపికైన వారు సంస్థ తరపున ఏజెంట్లను నియమించుకోవాలి. వారికి తగిన శిక్షణ, మెలకువలను అందించాలి. తద్వారా సంస్థ పాలసీలను ప్రజలకు విక్రయించాలి. ఈ సమయంలో వారు రూరల్, అర్బన్ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రాలు: హైదరాబాద్, కడప, కరీంనగర్, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి, సికింద్రాబాద్,విశాఖపట్నం, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

 

Source: Eenadu Paper

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here