ఏపీ బ్రాండింగ్ కొరకు బ్రాండ్ థాన్ పేరుతో యువతకు ఆహ్వానం 

1157

బ్రాండ్ థాన్ తో యువతకు ఆహ్వానం 

ఆంధ్ర ప్రదేశ్  బ్రాండ్  ఇమేజ్  పెంచడం కోసం  బ్రాండ్ థాన్ పేరుతో  సరికొత్త  కార్యక్రమాన్ని  ఏపీ  ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కోసం యువత నుంచి సరికొత్త  ఆలోచనలను , సలహాలను ఆహ్వానిస్తున్నామని మంత్రి మేకపాటి తెలిపారు. అక్టోబర్ 3 వ తారీఖున నుంచి 28 వ తారీఖు వరకు దరఖాస్తు స్వీకరిస్తునట్లు వివరించారు. వినూత్నమైన ఆలోచనలు కలిగి ఎంపికైన వారికీ బహుమతులు ఇస్తామని వెల్లడించారు.

మొదటి బహుమతికి 50 వేలు , రెండవ బహుమతి 25 వేలు మరియు మూడవ బహుమతి 10 వేలు ఇస్తామని ప్రకటించారు. కావున యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్రాండింగ్ పెంచే వినూత్నమైన ఆలోచనలను ఇవ్వాలని కోరారు. ఇందులో యువత ఏపీ బ్రాండ్ లోగో , ట్యాగ్ లైన్ పై సలహాలు ఇవ్వాలి. అభ్యర్థులు దరఖాస్తు కొరకు క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి. 

పోర్టల్ ఎంట్రీ కొరకు: https://bit.ly/2m1KVml

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here