IBPS/SSC Exams Free Coaching for Telangana Graduate Students

214

తెలంగాణలోని గిరిజన స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ

తెలంగాణలోని గిరిజన స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారిని మాత్రమే శిక్షణకు ఎంపిక చేస్తారు.
ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ కొరకు తెలంగాణలోని గిరిజన స్టడీ సర్కిళ్లు దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 100 మందికి అభ్యర్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 9న ప్రారంభమై సెప్టెంబరు 23తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 040-27540104 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
శిక్షణ అక్టోబరు 3 న ప్రారంభమై 45 రోజులపాటు కొనసాగుతుంది.

అర్హతలు

  1. తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  2. ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  3. గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  4. అభ్యర్థుల వయసు 01.06.2019 నాటికి 18 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
  5. కుటుంబ వార్షిక ఆదాయం ఎస్సీ, ఎస్టీకు రూ.2 లక్షలు, బీసీలకు రూ.1 లక్షకు మించకూడదు.
  6. ఉద్యోగం చేస్తున్నవారు, చదువుకుంటున్న వారు, తెలంగాణ, లేదా దేశంలోని ఇతర ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకుంటుననవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
  7. అభ్యర్థులు ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
  8. గతంలో శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు.
  9. మొత్తం 100 సీట్లలో రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీలకు 75%, ఎస్సీలకు 15%, బీసీలకు 10% సీట్లను కేటాయిస్తారు. ఒక్కో విభాగం నుంచి మహిళా కోటా కింద 33% సీట్లను కేటాయిస్తారు.

ఎంపిక విధానం:
పదోతరగతి, ఇంటర్, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఎంపికైనవారికి ఉచిత శిక్షణతోపాటు.. పుస్తకాలు, వసతి సదుపాయాల కోసం ఆర్థిక సాయం కూడా అందిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
1. నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019
2. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23.09.2019
3. అభ్యర్థుల ఎంపిక జాబితా: 27.09.2019
4. సర్టిఫికేట్ వెరిఫికేషన్: 30.09.2019
5. తరగతులు ప్రారంభం: 03.10.2019

నోటిఫికేషన్                              ఆన్‌లైన్ అప్లికేషన్                                     వెబ్‌సైట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here