గ్రామ సచివాలయ పరీక్ష రాసిన ఉద్యోగులకు 15 మార్కులు

3347

గ్రామ సచివాలయం  పరీక్ష  వ్రాసిన డిజిటల్  అసిస్టెంట్  అభ్యర్థులకు  రాత  పరీక్షలో 15 మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం  కేవలం  పంచాయితీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాత్రమే  వర్తిస్తుంది.  ప్రతి ఆరు నెలలకూ 1.5 మార్కుల చొప్పున గరిష్టంగా 15 మార్కులు రాత పరీక్షల్లో వచ్చిన మార్కులకు కలుపుతామని అన్నారు.

గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల రాత పరీక్షలను షెడ్యూల్ ప్రకారం ఈనెల 7న నిర్వహించనున్నట్లు పంచాయితీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి తెలిపారు. తమను ఇజనీరింగ్ గ్రేడ్‌-2 అసిస్టెంట్లుగా నియమించాలని పీఆర్ విభాగంలో కొంతమంది ఔట్‌సోర్పింగ్ సైట్ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. పిటిషనర్ల అభ్యర్ధనను ప్రభుత్వం 2 వారాల్లోపు పరిశీలించాలని, అప్పటివరకు ఇంజనీరింగ్ గ్రేడ్-2 అసిస్టెంట్ పోస్టుల నియామకం నిలిపివేయాలని గత నెల 21న హైకోర్టు ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం సైట్ ఇంజనీర్ల విజ్ఞప్తిని పరిశీలించిందని, కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here