గ్రామ సచివాలయం ధ్రువపత్రాల పరిశీలనకు ధ్రువపత్రాలు ఏమి తీసుకెళ్లాలి ?

2047

AP Sachivalayam Document Verification Schedule

AP Sachivalayam Document Verification

గ్రామ సచివాలయం జాబ్స్ ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపనున్నారు. అభ్యర్థులు వారి కాల్‌లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌
చేసుకొని ధ్రువపత్రాల పరిశీలనకు నిర్ణీత తేదీల్లో, నిర్ణీత కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన  సెప్టెంబరు 23 నుంచి ప్రారంభం కానుంది. కేటగిరీల వారీగా మార్కుల ఆధారంగా మరియు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన సెప్టెబరు 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు పరిశీలించనున్నారు.

అభ్యర్థికి ఏ రోజు, ఏ ప్రాంతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారో అన్న అంశాలన్నీ అభ్యర్థికి SMS ద్వారా పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఒకవేళ కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైనా.. అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి మరో ఛాన్స్‌ ఇవ్వనున్నారు.

ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి…

✦ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం తీసుకెళ్లాలి.
✦ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
✦ గెజిటెట్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికేట్లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్లాలి.
✦విద్యార్హతకు సంబంధించిన అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి.
✦ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి సర్టిఫికేట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి.
✦ 4 నుంచి 10వ తరగతి దాకా విద్యాభ్యాసానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు.
✦ పాఠశాలలో, కళాశాలలో చదవకుండా.. నేరుగా డిగ్రీ చదివినవారు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి.
✦ ఏపీ పునర్విభజన కారణంగా 02.06.2014 – 01.06.2019 మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన అభ్యర్థులు స్థానికత కోసం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
✦ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి.
✦ బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
✦ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొందిన అభ్యర్థులు తమ ప్రధానాధికారి నుంచి ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
✦ అభ్యర్థులు తమపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
✦ ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు, వినికిడి లోపాలు ఉన్న అభ్యర్థులు తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
✦ ఇక దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్, NCC విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here