నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ 

952

 

నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ Free Employment Training for Unemployed Youth

హైదరాబాద్‌లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ డెవలప్‌మెంట్ సంస్థలో ఉచిత శిక్షణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 5 వరకు అవకాశం ఉంది. ఈ కోర్సులకు గ్రామీణ, ప‌ట్టణ‌ ప్రాంతాలకు చెందిన పురుష అభ్యర్థుల‌ు ద‌ర‌ఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. కోర్సులకు బట్టి అభ్యర్థుల విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతి, ఇంటర్, బీకామ్ డిగ్రీ అర్హత ఉండి.. 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక్కో కోర్సుకి సీట్లు తక్కువగా ఉన్నందున ఎంపిక చేసిన అభ్యర్థులకు ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా ప్రవేశ వివరాలను తెలియజెస్తారు.

ఎంపికైన వారికి హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహికుల అభివృద్ధి సంస్థలో నవంబరు 18 నుంచి డిసెంబరు 24 వరకు శిక్షణ కొనసాగనుంది. కోర్సులకు ఎంపికైనవారికి శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు.

కోర్సు మరియు అర్హత వివరాలు..

 

కోర్సు  పేరు  అర్హత  కోర్సు వ్యవధి   సీట్ల సంఖ్య 
మొబైల్ సర్వీసింగ్ పదోతరగతి 40 రోజులు  25
ఎంఎస్ ఆఫీస్ ఇంటర్ 40 రోజులు  25
అకౌంటింగ్ (ట్యాలీ), జీఎస్టీ బీకామ్ డిగ్రీ 40 రోజులు  25

 

ప్రవేశాలు పొందినవారు నవంబరు 18న ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్‌లోని సంస్థ ఆవరణలో హాజరుకావాల్సి ఉటుంది. అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను, రెండు జతల జిరాక్స్‌ కాపీలను, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, 5 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాల్సి ఉంటుంది.

అభ్యర్థలకు ముఖ్య సూచనలు..

  • కోర్సు శిక్షణా సమయంలో అభ్యర్థులు ఇన్ స్టిట్యుట్ యొక్క హస్టల్ లోనే బస చేయాల్సి ఉంటుంది.
  • శిక్షణార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉంటాయి. విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉపయోగించుకోవడానికి మంచము, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థనే ఇస్తుంది.
  • 40 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వబడును.
  • శిక్షణ పూర్తి చేసిన అభ్యర్ధులకు మాత్రమే యోగ్యత పత్రము మరియు రాను, పోను చార్జీలు (ఎక్స్ ప్రెస్ బస్ / రైలు ) ఇవ్వబడును.
  • చదువు కొనసాగిస్తున్నవారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు.
  • అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకు సరిపడ తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొదలగు సొంత వస్తువులు తెచ్చుకొనవలెను.
  • వ్యక్తిగత వస్తువులను భద్రపరుచుకొనుటకు కావలసిన పెట్టె / బ్యాగు, తాళముతో సహా మీరే తెచ్చుకొనవలెను.

నోటిఫికేషన్ డౌన్లోడ్ కొరకు: Click Here 

ఆన్లైన్ అప్లికేషన్ కొరకు: Click Here 

అఫిషియల్ వెబ్సైట్ కొరకు: Click Here 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here