ప్రపంచంలోనే అతి పిన్నవయసులో ప్రధాని అయిన మహిళ

286

ప్రపంచంలోనే అతి పిన్నవయసులో ప్రధాని అయిన మహిళ


ఫిన్‌లాండ్‌లో రాజకీయ సంక్షోభం ముగిసి,సనా మారిన్‌ దేశ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అంటీ రిన్నే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్‌ డెమొక్రాట్‌ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి చేపట్టిన మహిళగా సనా చరిత్రకెక్కారు.
పోస్టల్‌ ఉద్యోగుల జీతాల కోతలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోషల్‌ డెమొక్రాట్లు- సెంటర్‌ పార్టీ నేత్వత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రిన్నే తీరుపై విమర్శలు చేయడం వల్ల, రినే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
సనా కంటే ముందు ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్‌(35) అత్యంత పిన్న వయస్సులో అత్యున్నత పదవి దక్కించుకున్న మహిళగా చరిత్రకెక్కిన సృష్టించారు.
ఫిన్‌లాండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలన్నీ మహిళల నేతృత్వంలోనివే(సనా మారిన్‌(34)- సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ, కాట్రీ కుల్ముని(32)- సెంటర్‌ పార్టీ, లీ అండర్సన్‌(32)- లెఫ్ట్‌ అలయన్స్‌, మారియా ఓహిసాలో(34)- గ్రీన్‌ లీగ్‌, అన్నా మజా హెర్నిక్సన్(55)- స్వీడిష్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఫిన్‌లాండ్‌).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here