Educational News in Telugu | 30 April 2020 | Vyoma

866

లాక్ డౌన్ తరువాత విమాన సర్వీసులపై మార్గదర్శకాలు టైర్ -1 నగరాలకే పరిమితం !

లాక్ డౌన్ తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలపై మార్గదర్శకాలు

లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసిన తరవాత విమానాశ్ర యాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం జారీ చేసింది. ప్రారంభంలో టైర్-1 నగరాలుగా పరిగ ణించే మెట్రోలు, రాష్ట్ర రాజధానుల్లో ఉండే విమ నాశ్రయాలతోపాటు కొన్ని ముఖ్యమైన టైర్-2 విమానాశ్రయాల నుంచే విమాన సర్వీసులు ఉంటాయి. అలాగే విమానాశ్రయంలో ఎక్కువ టెర్మినల్స్ ఉంటే మొదట ఒక్క టెర్మినల్ వినియోగించుకునేందుకు అనుమతిస్తారు. సామాజిక దూరాన్ని పాటించేందుకు అనువుగా బ్యాగేజీ తీసు కునే కరౌసెల్ను కూడా ఒకటి విడిచి ఒకటి వినియోగించుకోవాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే ఆహార ఔట్లెట్లను తెరిచేందుకు అనుమతిస్తారు.

10,12 తరగతుల పరీక్షలు నిర్వహిస్తాం సీబీఎస్ఈ ( CBSC )

లాక్ డౌన్ ఆంక్షల కారణంగా నిర్వహించ లేకపోయిన 10,12 తరగతుల పరీక్షలను సాధ్య మైనంత త్వరగా నిర్వహిస్తామని సీబీఎస్ఈ అధికారులు స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ తరగతులకు సంబంధించిన ముఖ్యమైన 29 సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఎంసెట్ దరఖాస్తులు 1.92 లక్షలు – మే 5 వరకు గడువు

టీ ఎస్ ఎం సెట్ కోసం బుధవారం వరకు 1,92,162 దరఖాస్తులు వచ్చాయని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు మే 5 వరకు గడువు ఉన్నదని వెల్లడించారు. లాక్ డౌన్ లో దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం ఉన్నదని తెలిపారు.

పాలిసెట్ దరఖాస్తుల గడువు మే 9

పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, దాన్ని మే 9 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి (ఎస్ బి టి ఈ టి ) కార్యదర్శి మూర్తి బుధవారం ప్రక టించారు. లాటరల్ ఎంట్రీ ఇన్ టూ పాలి టెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్పీ సెట్ ) దరఖాస్తుల గడువు మే 11 వరకు పొడి గించామన్నారు.

ఉచితంగా రిమోట్ ఇంటర్న్‌షిప్

స్మార్ట్ బ్రిడ్జ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమి టెడ్ ఆధ్వర్యంలో ఉచితంగా రిమోట్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ సంస్థ సీఈవో అమరేందర్ కటకం తెలి పారు. ఆసక్తిగల అభ్యర్థులు కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను చూడాలని కోరారు. https://smartinternz.com/

సాంఘిక, గిరిజన విద్యాలయాల విద్యార్థులకు ఆన్లైన్లో బోధన

లాక్ డౌన్ తో విద్యాబోధన డిజిటల్ లోకి మారుతున్నది. ఇండ్లకే పరిమితమైన సాంఘిక, గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో చదివే 2.10 లక్షల మంది విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశాలను ఆన్ లైన్  పద్ధతుల్లో బోధిస్తున్నట్టు TSWREI, TTWREI  విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలి పారు. ప్రస్తుతం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్), పరిధిలో 268 విద్యాసంస్థలు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్)లో 179 విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఐదోతర గతి నుంచి డిగ్రీ వరకు సుమారు 2.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నా రని పేర్కొన్నారు. వీరికి వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఈ-టెక్స్ట్ బుక్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ పుస్తకాలు, టీసాట్ టెలివి జన్ చానెల్ వంటి పద్ధతుల్లో తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాసే పదోతరగతి విద్యా ర్డులకు వ్యక్తిగతంగా లాగిన్ ఐడీలను అందజేశామని, మాక్ టెస్టులను ఆన్లై లో అందుబాటులో ఉంచామన్నారు.

ఆగస్టు 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం! యూజీసీ మార్గదర్శకాలు విడుదల

దేశవ్యాప్తంగా వర్సిటీల్లో కొత్త విద్యాసంవత్సరం ఆగస్టు 1న ప్రారంభం అవుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం వెల్లడించింది. పూర్వ విద్యార్థులకు తరగతులు ఆగస్టు 1న, కొత్త విద్యార్థులకు తరగతులు సెప్టెంబర్ 1న ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్సిటీలకు సమాచారమిచ్చింది. చివరి సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వ హించనున్నట్టు తెలిపింది. వారంలో ఆరు రోజుల పని దినాల విధానాన్ని వర్సిటీలు అమలు చేయవచ్చని సూచించింది. ఎంఫిల్, పీహెచ్ డీ విద్యార్థులకు మరో 6 నెలల సమయాన్ని పొడిగిస్తున్నట్టు, వైవా-వాయిస్ పరీక్షలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ మార్గదర్శకాలు సూచనలు మాత్రమేనని, కొవిడ్-19 పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలు వీటిలో స్వల్ప మార్పులు చేసుకోవచ్చని సూచించింది. కాగా, పెండింగులో ఉన్న పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల్ని లాక్ డౌన్ ముగిశాక మొదటి ప్రాధాన్యతగా నిర్వహించేందుకు సిద్ధమవుతు న్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. పరీక్ష తేదీల వివరాల్ని విద్యార్థులకు కనీసం పది రోజుల ముందుగా తెలియజేస్తామన్నారు. జేఈఈ, నీట్ పరీక్షల్ని జూలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ఆరు వర్సిటీల పరిధిలో డేటా సైన్స్, ఈ బిజినెస్ అనలైటిక్స్ కోర్సులు

వచ్చే విద్యాసంవత్సరం (2020-21) లో రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యా లయాల పరిధిలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలైటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల వర్సిటీల రిజిస్ట్రార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఈ విషయం వెల్లడించారు. బీఎస్సీ డేటా సైన్స్ సిలబసన్ను ఓయూ మాజీ ఉపకులపతి రామచంద్రం ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ, టీసీఎస్, కాగ్నిజెంట్ రూపొందిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here