అభిజిత్ వినాయక్ బెనర్జీకి 2019 సంవత్సరానికి గాను ఆర్థిక నోబెల్ పురస్కారం

408

అభిజిత్ వినాయక్ బెనర్జీకి 2019 సంవత్సరానికి గాను ఆర్థిక నోబెల్ పురస్కారం.

పేదరిక నిర్మూలన సిద్ధాంత రూపకర్త అయినటువంటి అభిజిత్ బెనర్జీ ప్రవాస భారతీయులు. క్షేత్ర స్థాయిలో పేదల స్థితిగతులు ఎలా ఉన్నాయి, కనీస జీవన ప్రమాణాలు ఎందుకు అందడం లేదు వంటి అనే అంశానికి పరిష్కారం వెతకడం కోసం ప్రత్యామ్యాయ మార్గాలను అన్వేషించి వాటిని పేదలకు సూచించడం వంటి వాటి పై ముగ్గురు ఆర్థిక వేత్తలు అభిజిత్ బెనర్జీ ఎస్తేర్ డూఫ్లో, మైఖేల్ కెమెర్ రాబర్ట్ కలిసి రెండు దశాబ్దాల పాటు శ్రమించి వీటికి మార్గాలు కనుగొన్నారు. ఆ ముగ్గురిలో అభిజిత్ బెనర్జీ తో పాటు అతని భార్య ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ కెమెర్ రాబర్ట్ ఉన్నారు.   భారతదేశంలో చదువుల్లో వెనుకబడిన 50 లక్షల మంది విద్యార్థులకు ట్యూషన్లు చెప్పించడం, వివిధ దేశాల్లో భారీ రాయితీతో ఆరోగ్య పథకాలు అమలు చేయడం వీరి ప్రయోగాల ఫలితం.

అభిజిత్ బెనర్జీకి 2019 సంవత్సరానికి గాను ఆర్థిక నోబెల్ పురస్కారం.

అభిజిత్ వినాయక్ బెనర్జీ

అభిజిత్ వినాయక్ బెనర్జీ కలకత్తా లో ఫిబ్రవరి 21, 1961 న జన్మించారు. తల్లి నిర్మలా బెనర్జీ, తండ్రి దీపక్ బెనర్జీ. పాఠశాల విద్య కలకత్తా లోని సౌత్ పాయింట్ స్కూల్ లో కొనసాగింది. 12 వ తరగతి తరువాత 1981 లో ఆర్థిక శాస్త్రంలో బి ఎస్సి డిగ్రీ పొందారు. 1983 లో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ నాలుగేళ్ళ పాటు ప్రిన్సెటాన్ విశ్వవిద్యాలయం, ఏడాది పాటు హార్వర్డ్ లో బోధకులుగా పనిచేసారు. 1988 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేశారు. 1993 నుంచి ఎం. ఐ. టి లో ఆచార్యునిగా కొనసాగుతున్నారు. 2015 సంవత్సరం అనంతరం అభివృద్ధి అజెండా పై ఐరాస ఏర్పాటు చేసిన ప్రముఖుల సంఘంలో సభ్యునిగా ఎంపిక.

ఎస్తేర్ డూఫ్లో 

ఎస్తేర్ డూఫ్లో 25 అక్టోబర్ 1972 లో ఫ్రాన్స్ లోని పారిస్ లో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం డిగ్రీ వరకు పారిస్ లోనే కొనసాగింది. తరువాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పి.హెచ్.డి చేశారు. కొన్ని అంతర్జాతీయ బహుతుమతులకు ఎంపికయ్యారు. అందులో జాన్ బెట్స్ క్లార్క్ మెడల్ (2010), కాల్వో-అర్మెంగోల్ ఇంటర్నేషనల్ బహుమతి (2010), డాన్ డేవిడ్ బహుమతి (2013), మరియు పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఆర్ధిక పరిష్కారాన్ని కనుగొన్న ముగ్గురికి అభిజిత్ బెనర్జీ, మైఖేల్ రాబర్ట్ క్రెమెర్, ఎస్తేర్ సంయుక్తంగా 2019 సంవత్సరానికి ఆర్థిక నోబెల్ పురస్కారం ఎంపికయ్యారు. 

మైఖేల్ కెమెర్ రాబర్ట్ 

కెమెర్ న్యూయార్క్ కి చెందిన నైపుణ్య రంగ నిపుణుడు. విద్యాభ్యాసం అంతా హార్వర్డ్ మరియు ఎం.ఐ.టి విశ్వవిద్యాలయాల్లోనే కొనసాగింది. అక్కడే కొంతకాలం పాటు అధ్యాపకుడుగా కొనసాగారు. అనంతరం హార్వర్డ్ కు మారారు. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల పై కూడా ఆయన పరిశోధనలు చేసారు. క్రెమెర్ రూపొందించిన “ఓ రింగ్ థియరీ” కి ప్రాధాన్యం లభించింది. సెలవుల్లో డిగ్రీ విద్యార్థులు పాఠశాలల్లో ఉచితంగా పాఠాలు బోధించడం వంటి వాటిని ప్రోత్సహించడం కోసం “వరల్డ్ టెక్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here