అమితాబ్ బచ్చన్ కి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం 2019

502

అమితాబ్ బచ్చన్ కి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం 2019

భారత సినీ పరిశ్రమలో విశిష్టమైన సేవలందించే వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ పురస్కారాలను అందచేస్తుంది. 2019 సంవత్సరానికి గాను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. భారతీయ సినీ పరిశ్రమలో విశిష్ట సేవలందించే నటీనటులు, సంగీతదర్శకులు, నేపథ్య గాయకులు, దర్శకులు, పాటల రచయితలు, ఛాయాగ్రాహకులు, నిర్మాతలు, మొదలగు క్రియాశీలక పాత్రలు పోషించే కళాకారులకు ఈ అవార్డును అందచేస్తారు.

అమితాబ్ బచ్చన్ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2019

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 

భారతీయ సినీ పరిశ్రమకు పితామహుడిగా చెప్పుకునే శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు దుండిరాజు గోవిందరాజు. దుందిరాజు గోవిందరాజు గారు నాసిక్ కు 30 కోలోమీటర్ల దూరంలో త్రియంబకేశ్వర్ లో జన్మించారు. బొంబాయి లోని స్కూల్ అఫ్ ఆర్ట్స్ లో మరియు బరోడా కళాభవన్ లో విద్యాభ్యాసం చేసారు.1896 లో బొంబాయి లోని వాట్సన్ హోటల్ లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమా ను చూశారు. ఆ ప్రభావానికి లోనైన గోవిందరాజు గారు ఎలాగైనా హైందవ దేవతలను చూపుతూ సినిమా తీయాలనే దృఢ సంకల్పంతో 1913 రాజా హరిశ్చంద్ర  సినిమాను తీశారు. అలా వారు 19 సంవత్సరాల పాటు సినీ నిర్మాతగా, దర్శకులుగా, స్క్రీన్ ప్లే రచయితగా 95చిత్రాలను, 26 లఘు చిత్రాలను రూపొందించారు. ఈ విధంగా తొలిసారిగా తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో భారతీయ సినీ పరిశ్రమ పితామహులుగా పేరుగాంచారు.  తొలిసారిగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్బంగా పురస్కారాలను ఇవ్వటం ప్రారంభించారు. పురస్కారం తొలిసారిగా సినీ పరిశ్రమకు విశిష్ట సేవలందించిన దేవికారాణి గారికి అందజేశారు.

ఇప్పటి వరకు దాదాసాహెబ్ పురస్కారం అందుకున్న వారి వివరాలు

1969 – దేవికా రాణి, నటి.
1970 – బి.ఎన్.సర్కార్, నిర్మాత.
1971 – పృథ్వీరాజ్ కపూర్, నటుడు.
1972 – పంకజ్ మల్లిక్, సంగీత దర్శకుడు.
1973 – సులోచన.
1974 – బి.ఎన్.రెడ్డి, దర్శకనిర్మాత.
1975 – ధీరేన్ గంగూలీ, నటుడు.
1976 – కానన్ దేవి, నటి.
1977 – నితిన్ బోస్, దర్శకుడు.
1978 – ఆర్.సి.బోరల్, స్క్రీన్ ప్లే.
1979 – సోహ్రాబ్ మోడి, దర్శకనిర్మాత.
1980 – పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు.
1981 – నౌషాద్, సంగీత దర్శకుడు.
1982 – ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు.
1983 – దుర్గా ఖోటే, నటి.
1984 – సత్యజిత్ రే, దర్శకుడు.
1985 – వి.శాంతారాం, దర్శకుడు, నిర్మాత, నటుడు.
1986 – బి.నాగిరెడ్డి, నిర్మాత.
1987 – రాజ్ కపూర్, నటుడు, దర్శకుడు.
1988 – అశోక్ కుమార్, నటుడు.
1989 – లతా మంగేష్కర్, గాయని.
1990 – ఎ.నాగేశ్వర రావు, నటుడు.
1991 – భాల్జీ ఫెండార్కర్, గాయకుడు, సంగీత దర్శకుడు.
1992 – భూపేన్ హజారికా, గాయకుడు, సంగీత దర్శకుడు.
1933- మజ్రూహ్ సుల్తాన్‌పురి, పాటల రచయిత.
1994 – దిలీప్ కుమార్, నటుడు, గాయకుడు.
1995 – రాజ్ కుమార్, నటుడు, గాయకుడు.
1996 – శివాజీ గణేశన్, నటుడు.
1997 – ప్రదీప్, పాటల రచయిత.
1998 – బి.ఆర్.చోప్రా, దర్శకుడు, నిర్మాత.
1999 – హృషీకేష్ ముఖర్జీ, దర్శకుడు.
2000 – ఆషా భోంస్లే, గాయని.
2001 – యష్ చోప్రా, దర్శకుడు, నిర్మాత.
2002 – దేవానంద్, నటుడు, దర్శకుడు, నిర్మాత.
2003 – మృణాల్ సేన్, దర్శకుడు.
2004 – అదూర్ గోపాలక్రిష్ణన్, దర్శకుడు.
2005 – శ్యాం బెనగళ్, దర్శకుడు.
2006 – తపన్ సిన్హా, దర్శకుడు.
2007 – మన్నా డే, గాయకుడు.
2008 – వి.కె.మూర్తి, ఛాయాగ్రాహకుడు.
2009 – డి.రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు.
2010 – కైలాసం బాలచందర్, దర్శకుడు.
2011 – సౌమిత్ర చటర్జీ, నటుడు.
2012 – ప్రాణ్, నటుడు.
2013 – గుల్జార్, నటుడు.
2014 – శశికపూర్, నటుడు.
2015 – మనోజ్ కుమార్, నటుడు, దర్శకుడు, నిర్మాత.
2016 – కె.విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత.
2017 – వినోద్ ఖన్నా.
2018 – అమితాబ్ బచ్చన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here