కోల్ ఇండియా లిమిటెడ్ లో 88,585 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…..నిజామా ? కాదా ?

390788585 వేల పోస్టులతో సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో తో భారీ నోటిఫికేషన్ అని న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. అసలు ఇది ఫేక్ న్యూస్? లేదా నిజామా ? కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్ నుండి ఈ నోటిఫికేషన్ వెలుబడింది అని చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి సంస్థ sccl అని కోల్ ఇండియా లో లేదు.

 

 

కొన్ని  నియామక ఏజెన్సీలు,   కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) లో 88,585 వేల  ఉద్యోగాలను కల్పిస్తామంటూ  ఉద్యోగార్ధులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు.   CIL లో తప్పుడు ఉపాధి అవకాశాలను మోసపూరితంగా అందించడమే కాకుండా సిఐఎల్ యొక్క అధికారిక  వెబ్సైటు  http://www.scclcil.in లో రిజిస్టర్ చేసుకోవాలని ఫేక్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

 

ఇటువంటి ఏజెన్సీలు  ఉద్యోగ ఆఫర్లతో  ఉద్యోగార్ధులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు మరియు నకిలీ నోటిఫికేషన్ ను జారీ చేస్తారు. కల్పిత లెటర్‌హెడ్‌లు మరియు సిఐఎల్ యొక్క ఇతర వివరాలను ఉపయోగించి అపాయింట్‌మెంట్ లెటర్స్, సెక్యూరిటీ డిపాజిట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు మొదలైనవి జారీ చేస్తారు. సాధారణంగా ప్రజలు మరియు  ఉద్యోగార్ధులు  అటువంటి మోసగాళ్ల  ఏజెన్సీల చేతులలో పడవద్దని సలహా ఇస్తున్నాము. 

అభ్యర్థులు ఇది గమనించి దయచేసి ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి మోసపోకండి. మీ స్నేహితులకు, బందువులకు తెలియజేయండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here