Chandrayaan-2 Orbiter Locates Lander Vikram on Moon

207

   ల్యాండర్‌ విక్రమ్‌ ఆచూకీ లభ్యం చంద్రయాన్​-2

చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​ జాడ తెలిసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్​ కె. శివన్​ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీ కనుక్కోగలిగాం.ల్యాండర్​ థర్మల్​ చిత్రాన్ని ఆర్బిటర్​ తీసింది. అయితే ప్రస్తుతం ల్యాండర్​తో సంబంధాలు లేవు. సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము.త్వరలోనే ఇది పూర్తిఅవుతుందని ఇస్రో చైర్మన్ వెల్లడించాడు .

విక్రమ్ ల్యాండర్ ను ఆర్బిటర్ ద్వారా సాప్ట్ రన్నింగ్ జరిపేటప్పుడు విక్రమ్ తో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఆర్బిటర్ ద్వారా విక్రమ్ జాడ తెలుస్తోందని సైంటిస్టులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజం అయింది. ఏడున్నర సంవత్సరాలు పనిచేసే ఆర్బిటర్ అనుకున్నట్టుగానే విక్రమ్ జాడ చూపించిందన్నారు శివన్. ఇదే స్ఫూర్తితో ల్యాండర్ సంకేతాలు మెరుగవుతాయని శివన్ పేర్కొన్నారు. ల్యాండర్ ను యాక్టివేట్ చేసి, సంకేతాలు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఇస్రో పేర్కొంది.

విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన ఆర్బిటర్ ద్వారా దాని జాడ తెలిసింది. విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన హైరిజల్యూషన్, హైబీమ్ థర్మల్ కెమెరా కొన్ని ఫొటోలు తీసింది.ఆ ఫొటోలే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ జాడను తెలిసేలా చేశాయి. థర్మల్ కెమెరా ఫొటోలను క్లిక్ మనిపించగానే ఆ సందేశం క్షణాల వ్యవధిలో గ్రౌండ్ స్టేషన్ కు చేరిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిందని నిర్ధారించారు. తాము ఆశించిన విధంగా సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా హార్డ్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని ఇస్రో ఛైర్మన్ మరియుశాస్రవేత్తలు వెల్లడించారు.

                                      చంద్రుడిపై  భారీ ప్రయోగం

ఇక చంద్రుడిపై పరిశోధనల్లో భాగంగా ఇస్రో తదుపరి భారీ ఉపగ్రహాన్నే ప్రయోగించనున్నది. ఇందులో భాగంగా చంద్రుడి ధృవ ప్రాంతం నుంచి శాంపిల్స్‌నూ తీసుకొచ్చే అవకాశమూ ఉన్నది.

ఇందు కోసం జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(జక్సా)తో ఇస్రో చేతులు కలుపనున్నది. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ (రోస్కోస్‌మాస్‌)తో సంయుక్తంగా ముందుకు తీసుకెళ్దామని 2008లో భారత్‌ భావించింది.విక్రమ్​ ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయిన అనంతరం శివన్​ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆ సమయంలో శివన్​ను మోదీ హత్తుకుని ఓదార్చిన వీడియో అంతర్జాలంలో విపరీతంగా వైరల్​ అయింది. అది కేవలం ప్రధాని ఒక్కరి ఓదార్పు కాదని దేశం మొత్తానిది అంటూ నెటిజన్లు ఇస్రోకు మద్దతు పలికారు.ఇస్రో రూపకల్పన ప్రకారం – ఇంతవరకు ఏ దేశం కూడా కాలూనని ప్రదేశంలో, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగుతుంది.దాన్నుండి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ వివిధ పరీక్షలు చేస్తుంది. 14 భూమి రోజుల పాటు (ఒక చంద్రుడి పగలు) అది పరీక్షలు జరుపుతుంది. ఆర్బిటరు చంద్రకక్ష్యలో సంవత్సరం పాటు పనిచేస్తుంది.సాప్ట్ రన్నింగ్ జరిపేటప్పుడు విక్రమ్ తో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఆర్బిటర్ ద్వారా విక్రమ్ జాడ తెలుస్తోందని సైంటిస్టులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజం అయింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here