గ్రామ సచివాలయం సర్టిఫికెట్ పరిశీలన సూచనలు 

4578

గ్రామ సచివాలయం సర్టిఫికెట్ పరిశీలన సూచనలు 

 

గ్రామ సచివాలయం రాతపరీక్షల యొక్క  మెరిట్  జాబితాలను  వర్గీకరించి జిల్లాలవారీగా ఆయా ప్రాంతాలకు పంపారు. గ్రామ సచివాలయం రాతపరీక్షల  ఫలితాలు శుక్రవారం విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ మెరిట్ అభ్యర్థులకు జిల్లా సెలక్షన్‌ కమిటీలు శని, ఆదివారాల్లో కాల్‌ లెటర్లు అందించే అవకాశం ఉంది. ఈ కాల్‌ లెటర్లు గ్రామ  సచివాలయ పోస్టుల సంఖ్య ఆధారంగా మరియు రిజర్వేషన్ల ప్రకారం అందబడుతాయి.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  23, 24, 25వ తేదీల్లో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నిర్దేశించిన చోట హాజరు కావాలి.

 

వెరిఫికేషన్‌ మరియు నియామకాల తేదీలు 

వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ – 21/09/2019 నుంచి
కాల్‌ లెటర్ల జారీ – 21/09/2019 – 22/09/2019
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ – సెప్టెంబర్‌ 23 నుంచి 25
నియామక ఉత్తర్వుల జారీ – 27/09/2019
అవగాహన కార్యక్రమం – 1,2/10/2019
గ్రామ/వార్డు సచివాలయాల ప్రారంభం – 02/10/2019

కేటగిరీలవారీగా ఉత్తీర్ణుల సంఖ్య

ఓపెన్‌ – 24,583
బీసీ – 1,00,494
ఎస్సీ – 63,629
ఎస్టీ – 9,458
పరీక్షకు హాజరైన అభ్యర్థులు – 19,50,630
ఉత్తీర్ణులు – 1,98,164

కేటగిరీలవారీగా అభ్యర్థులు సాధించిన గరిష్ట మార్కులు

ఓపెన్‌ కేటగిరిలో – 122.5
బీసీ కేటగిరిలో – 122.5
ఎస్సీ కేటగిరిలో – 114
ఎస్టీ కేటగిరిలో  -108
మహిళా అభ్యర్థుల్లో  – 112.5
పురుష అభ్యర్థుల్లో గరిష్టంగా – 122.5
ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు అదనంగా 10% వెయిటేజ్‌ మార్కులు 

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here