దేశవ్యాప్తంగా కేంద్రంలో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ

1881

దేశవ్యాప్తంగా కేంద్రంలో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ

Central Government Job Vacanciesకేంద్ర ప్రభుత్వములో కొన్ని విభాగాలలో  గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం 6,83,823 ఖాళీలున్నాయని కేంద్ర వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభకు తెలిపారు. ఇందులో మొత్తం  గ్రూప్‌-సి ఉద్యోగాలు 5,74,289 కాగా, గ్రూప్‌-బి ఉద్యోగాలు 89,638. గ్రూప్‌-ఎ ఉద్యోగాలు 19,896 ఉన్నాయని కేంద్రం  తెలియజేసింది.

ఈ మొత్తం ఉద్యోగాల భర్తీలో దాదాపు 1,06,338 ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు. 2018-19లో గ్రూప్‌-సి, లెవల్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన 1,56,138 ఖాళీల భర్తీకి సీఈఎన్‌ మరో నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు దాదాపు 19,522 గ్రేడ్‌ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ కూడా పరీక్షలు నిర్వహించిందని ఆయన తెలిపారు. ఇవన్నీ కలిపి దాదాపు 4,08,591 ఖాళీల భర్తీకి ఎస్సెస్సీ, ఆర్‌ఆర్బీ, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ నోటిఫికేషన్లు జారీ చేశాయని, భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

దీనితో పాటు వివిధ శాఖల్లో గల బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ పోస్టులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు  ఖాళీలు ఉన్నాయన్నారు.ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందని ఆయన వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here