ఏపీపీఎస్సీ  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా 

642

ఏపీపీఎస్సీ  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా 

APPSC Group 1 Mains Exam Postponementఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త ..’గ్రూప్-1′ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొన్ని కారణాల చేత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు నవంబరు 6 న  అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మెయిన్స్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూలును నవంబరు 13న వెల్లడించనున్నట్లు తెలిపింది. మొత్తం 8,351 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే పాలనాపరమైన  కారణాల వల్ల పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ  నిర్ణయంతో మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  అభ్యర్థులకు మరింత సమయం దక్కనుంది.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు వివరాలు:

పరీక్ష  పరీక్ష తేదీ 
తెలుగు  12/12/2019
ఇంగ్లిష్  13/12/2019
పేపర్ 1 15/12/2019
పేపర్ 2 17/12/2019
పేపర్ 3 19/12/2019
పేపర్ 4 21/12/2019
పేపర్ 5 23/12/2019

 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల కొరకు: క్లిక్క్ చేయండి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here