గెజిటెడ్ పోస్టుల ఫలితాలను వెల్లడించిన APPSC

896

గెజిటెడ్ పోస్టుల ఫలితాలను వెల్లడించిన APPSC

ఏపీలో మొత్తం 31 గెజిటెడ్ పోస్టులగాను ఏపీపీఎస్సీ మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ నోటిఫికేషన్ కు ఏపీపీఎస్సీ ఆగస్టు 11న స్కీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) డిసెంబరు 10 తాజాగా వెల్లడించింది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించి వారికి మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆగస్టు 11న నిర్వహించిన రాతపరీక్షలో మొత్తం 511 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని కటాఫ్ మార్కుల ప్రకారం జనరల్ విభాగంలో 456 మంది అభ్యర్థులు, ఎస్టీ విభాగంలో 48 మంది అభ్యర్థులు, దివ్యాంగుల నుంచి 7 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

మొత్తం పోస్టులు: 31

పోస్టులు విభాగం సంఖ్య
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్ 04
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్ 03
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ 02
సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీస్ 09
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ 06
అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ & కంట్రీ ప్లానింగ్ సర్వీస్ 02
అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ 01
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఏపీ టౌన్ & కంట్రీ ప్లానింగ్ సర్వీస్ 01
రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఏపీ మైనింగ్ సర్వీస్ 02
టెక్నికల్ అసిస్టెంట్
(ఆటోమొబైల్ ఇంజినీరింగ్)
ఏపీ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ 01
మొత్తం పోస్టులు 31

 

గెజిటెడ్ పోస్టుల ఫలితాలు

మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు..
కటాఫ్ మార్కుల వివరాలు..
రిజక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here