ఏపీ లో భారీగా విద్యావాలంటీర్ల నియామకం

2121

ఏపీ లో భారీగా విద్యావాలంటీర్ల నియామకం

ఏపీ లోని ప్రభుత్వం పాఠశాలల్లో నిరుద్యోగుల కొరకు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. పని సర్దుబాటు కింద ప్రభుత్వ పాఠశాలల్లో బదిలీలు నిర్వహించిన సంగతి రాష్ట్రవ్యాప్తంగా తెలిసిందే. దీని యొక్క పూర్తి వివరాలు క్రింద పేర్కొనబడినవి..

8 వేల విద్యావాలంటీర్ల నియామకాల్లో  2,400 ఎస్జీటీ( సెకండరీ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులు కాగా, మిగిలినవి స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ మరియు స్కూల్  అసిస్టెంట్ టీచర్ గ ఎంపికైన వారికీ వేతనాలు క్రింద తెలుపడం జరిగింది. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించనున్నారు.

  • ఎస్జీటీ – రూ.5000
  • స్కూల్ అసిస్టెంట్ – రూ.700

ఈ విద్యావాలంటీర్ పోస్టుల నియామకానికి  సంబంధించి దాదాపుగా 800 పోస్టులను  తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 100 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here