గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాల శిక్షణ షెడ్యూల్ 

3270

గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాల శిక్షణ షెడ్యూల్ 

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం  ప్రణాళికాబద్ధమైన శిక్షణ కోసం షెడ్యూల్ ని  ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ రాష్ట్రం లోని అన్ని జిల్లాలలోని శిక్షణ కేంద్రాలలో అక్టోబర్ 14 నుంచి ఏప్రిల్ 11 వరకు నాలుగు బ్యాచ్ లలో జరగాలని పురపాలక శాఖ కమిషనర్ , డైరెక్టర్ కె. విజయకుమార్ గారు గురువారం తెలిపారు.

వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక అయిన ఉద్యోగులు అంటే అడ్మినిస్ట్రేటివ్ , ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ , అమెంటిస్ , శానిటేషన్ ఎన్విరాన్మెంట్ , వెల్ఫేర్ , ప్లానింగ్ రెగ్యులేటరీ విభాగాలకు పురపాలక శాఖ శిక్షణ ఇస్తుంది. ఈ ఉద్యోగులను నాలుగు బ్యాచ్ లుగా విభజించి శిక్షణ ఇస్తారు. వాటి యొక్క వివరాలు మరియు తేదీలు…. 

 

శిక్షణ తేదీలు 

  • మొదటి బ్యాచ్  – 14/10/2019 నుంచి 21/12/2019
  • రెండవ  బ్యాచ్  – 11/11/2019 నుంచి 06/01/2020
  • మూడవ  బ్యాచ్  – 20/01/2020 నుంచి 28/03/2020
  • నాల్గవ  బ్యాచ్  – 17/02/2019 నుంచి 11/04/2019

విభాగాల వారీగా బ్యాచ్ లు

  • అడ్మినిస్ట్రేటివ్ విభాగం   బ్యాచ్ కు 827 మంది (మొత్తం ఉద్యోగులు 3,307)
  • ఎడ్యుకేషన్ – డేటా ప్రాసెసింగ్ విభాగం   బ్యాచ్ కు 947 మంది(మొత్తం ఉద్యోగులు 3,786)
  • అమెంటిస్ విభాగం  బ్యాచ్ కు 900మంది(మొత్తం ఉద్యోగులు 3,601)
  • శానిటేషన్ – ఎన్విరాన్మెంట్ విభాగం బ్యాచ్ కు 912 మంది(మొత్తం ఉద్యోగులు 3,648)
  • వెల్ఫేర్ విభాగం బ్యాచ్ కు 947 మంది(మొత్తం ఉద్యోగులు 3,786)
  • ప్లానింగ్ రెగ్యులేటరీ విభాగం బ్యాచ్ కు 942 మంది(మొత్తం ఉద్యోగులు 3,770)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here