ఏపీ గ్రామ సచివాలయ టాపర్లు – వెరిఫికేషన్ షెడ్యూల్

1050

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి కోసం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

రాతపరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (సెప్టెంబరు 19) న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసారు . పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 1,98,164 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు.
పురుషులు-1,31,327 ,
స్త్రీలు- 66,835
అర్హత సాధించినవారికి తర్వాతి దశలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను http://gramasachivalayam.ap.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

కేటగిరీల వారీగా అర్హత వివరాలను పరిశీలిస్తే..

కేటగిరీ అర్హత సాధించిన అభ్యర్థులు
ఓపెన్ కేటగిరీ 24,583
బీసీ 1,00,494
ఎస్సీ 63,629
ఎస్టీ 9,458
మొత్తం 1,98,164

 

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల్లో కేటగిరీ వారీగా టాపర్లుగా నిలిచిన అభ్యర్థుల వివరాలు.

కేటగిరీ-1 టాపర్లు

పేరు జిల్లా మార్కులు
జి.అనితమ్మ అనంతపురం 112.25
గంజవరపు లోవరాజు తూర్పుగోదావరి 111.50
దొడ్డ వెంకట్రామిరెడ్డి ప్రకాశం 111.25

కేటగిరీ 2 – గ్రూప్ 2() టాపర్లు..

పేరు జిల్లా మార్కులు
సంపతిరావు దిలీప్ శ్రీకాకుళం 120.5
మేడిద దుర్గారావు తూర్పుగోదావరి 117.5
అంజూరి సాయి దినేశ్ కృష్ణా 116

కేటగిరీ 2 – గ్రూప్ 2(బి)..

పేరు జిల్లా మార్కులు
ఉపేంద్రం సాయి కుమార్ రాజు కర్నూలు 122.50
కంచరాణి సురేంద్ర పశ్చిమగోదావరి 119.5
సవ్వన గోపీ కృష్ణ విశాఖపట్నం 118.75

కేటగిరీ-3 పోస్టుల టాపర్లు..
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్

పేరు జిల్లా మార్కులు
సల్లమల్లి సురేశ్ 110.25
సుందరి శిరీష చిత్తూరు 107.75
దుద్యాల లోకేశ్వర్ రెడ్డి 107.25

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్

పేరు జిల్లా మార్కులు
పొన్నాడ జ్యోతిర్మయి విశాఖపట్నం 114
పులి శ్రీధరరెడ్డి గుంటూరు 111.25
బి. ఉదయ కుమార్ నాయుడు కర్నూలు 110.75

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్

పేరు జిల్లా మార్కులు
జొన్నల దివ్య గుంటూరు 106.25
గడారి మోహన కృష్ణ 105
దాసరి పామన్న 103.75

పంచాయతీ కార్యదర్శి (డిజిటల్ అసిస్టెంట్)

పేరు మార్కులు
వి. విష్ణువర్ధన్ రెడ్డి 102.50
మహేశ్వర రెడ్డి వెన్న 93
షేక్ ఇర్ఫాన్ హుస్సేన్ 88.25

వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ

పేరు మార్కులు
దొడ్డ వెంట్రామిరెడ్డి 105
జామి ప్రియాంక 100
పి. ఇమ్రానుల్లా హక్ 85

వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ

పేరు మార్కులు
ఉప్పల వెంకటసాయి రామన్ 95.75
సవన్న గోపీ కృష్ణ 93.25
సంగరాజు పవన్ కృష్ణ కుమార్ రాజు 93.25

వెటర్నరీ అసిస్టెంట్

పేరు మార్కులు
అక్కెన గణపతి 112.50
అప్పలరాజు పాముల 112
పులపాకుల శాంతిరాజు 109.5

ANM/ వార్డు హెల్త్ సెక్రటరీ

పేరు మార్కులు
భాగ్యలక్ష్మీ దాసరి 111.25
ఆహ్లాదం సాయి అంజన 109.25
కె.సఫియా 103.75

వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ

పేరు మార్కులు
కాసు జగన్ మోహన్ రెడ్డి 96.25
మెట్టు సతీష్ 93.75
సురేశ్ బాబు సింగంశెట్టి 90.25

వార్డు వెల్ఫేర్/ డెవలప్‌మెంట్ సెక్రటరీ

పేరు మార్కులు
శ్రీనివాసరావు సూకారపు 107
అడపా జయ సంతోష్ భాను 99
రాయపురెడ్డి వంశీధర్ రెడ్డి 95

నేడు జిల్లాలకు పంపనున్న గ్రామ, వార్డు సచివాలయ మెరిట్ జాబితా
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.

వెరిఫికేషన్ షెడ్యూల్ (Verification Schedule):
వెబ్సైట్ సర్టిఫికెట్ల అప్లోడ్ 21.09.2019 నుండి.
కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
వెరిఫికేషన్ 23-25 సెప్టెంబర్ 2019
నియామక ఉత్తర్వుల జారీ 27.09.2019
అవగాహనా కార్యక్రమం 1 & 2 అక్టోబర్ 2019
గ్రామ/వార్డు సచివాలయాలు ప్రారంభం 02.10.2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here