Acharya NG Ranga Agricultural University Has Released Agricet Result 2019

287

AGRICET-2019 ఫలితాలు విడుదల చేసిన ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఏపీలో నిర్వహించిన వ్యవసాయ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్ష ఫలితాలను ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సెప్టెంబరు 12 విడుదలచేసింది. గుంటూరులోని ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీసీ దామోదరనాయుడు ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, సీడ్ టెక్నాలజీ విభాగాల వారీగా అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 3661 మంది పరీక్షకు హాజరుకాగా 50 మంది మాత్రమే అర్హత సాధించారు. , ఆర్గానిక్ ఫార్మింగ్ విభాగంలో 82 మంది పరీక్షకు హాజరుకాగా.. 20 మంది, సీడ్ టెక్నాలజీలో 355 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 20 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.

* అగ్రిసెట్-2019 ఫలితాలు
2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హానర్స్) కోర్సులో ప్రవేశానికి త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ర్యాంకు కార్డుతోపాటు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here