ప్రస్తుతం ఏ నియామక పరీక్ష తీసుకున్నా సిలబస్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్, ఫైనాన్షియల్ / ఎకానమీ వంటి అంశాలు ఉంటున్నాయి. ఇప్పటికే బ్యాంక్, ఎస్ ఎస్ సీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఆయా పరీక్షల ప్రిపరేషన్ దీనికి సరిపోతుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ టెస్ట్ మెటీరియల్, మాక్ ! మోడల్ టెస్ట్లు ఫాలో కావడం ప్రయోజనకరం.. * జనరల్ నాలెడ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం, కార్మిక శాఖ, ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్ మెంట్, ఈపీఎఫ్ఓ సంబంధిత అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. డిస్క్రిప్టివ్ విభాగంలో ఎస్సే రైటింగ్, ప్రైసిస్ రైటింగ్ అంశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచుకోవాలి. రోజూ ఆంగ్ల దినపత్రికలను చదవడం ఉపయోగకరం. వాటిల్లో ఎడిటోరియల్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. తక్కువ పదాలతో ఎక్కువ మొత్తంలో సమాచారం రాసేలా అవగాహనను పెంచుకోవాలి. ప్రైసిస్ రైటింగ్లో ఇచ్చిన వ్యాసాన్ని కుదించి రాయాలి. తగిన హెడ్డింగ్ పెట్టాలి. లెటర్ రైటింగ్లో వివిధ అంశాలపై లెటర్స్ రాయాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ కోసం ఆన్లైన్లో చాలా సోర్స్ లభిస్తాయి. వాటిని కూడా ఉపయోగించుకోవాలి.. + రెండు దశల్లో కీలకమైంది. ప్రిలిమ్స్. ఎందుకంటే లక్షల మంది
నుంచి వేల మందికి మాత్రమే మెయిన్ కు అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రిలిమ్స్ లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. గత కటాఫ్ లను పరిశీలిస్తూ దాని కంటే ఎక్కువ మార్కులు సాధించేలా కృషి చేయాలి. వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి..
Source: Andhra Jyothi Paper